శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

1 గంట క్రితం

deva.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 11:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : ప్రముఖ తమిళ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు ‘తేనిసై తేండ్రల్‌’ దేవా (75) శనివారం చెన్నైలో కన్నుమూశారు. ఉదయం 8.30 గంటల సమయంలో అస్వస్థతకు గురైన ఆయనను సూర్య ఆసుపత్రిలో చేర్పించగా,చికిత్స పొందుతూ మృతి చెందారు.

1950 నవంబర్‌ 20న జన్మించిన దేవా, మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రస్థానంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాలకు సంగీతం అందించారు. అన్నామలై, బాషా, ఆశై, కాదల్‌ కోట్టై, నేరుక్కు నేర్‌, ప్రియముడన్‌, వాలి, ఖుషి వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

చెన్నై గానా సంగీతాన్ని ప్రధాన స్రవంతి తమిళ సినీ సంగీతంలోకి తీసుకురావడంలో దేవా కీలక పాత్ర పోషించారు. జానపద బాణీలతో పాటు మధురమైన ప్రేమగీతాలు, భక్తి పాటలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే కలైమామణి పురస్కారంతో ఆయన గౌరవం పొందారు. ఆశై చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కూడా అందుకున్నారు.

ఆయన కుమారుడు శ్రీకాంత్‌ దేవా సినీ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందగా, సోదరులు శబేష్‌, మురళి కూడా సంగీత రంగంలో పనిచేశారు. దేవా మరణంతో సినీ సంగీత రంగంలో విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్