శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు

1 గంట క్రితం

avinash.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – పులివెందుల టౌన్ : కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పట్టణ సీఐ పురుషోత్తం రాజు నోటీసులు అందజేశారు. శనివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ నోటీసులు అందించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పులివెందుల పట్టణంలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీసు చట్టం అమలులో ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. పట్టణంలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఎంపీ అవినాష్ రెడ్డిని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్