ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోరాలు శివకుమార్ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. పద్మశాలి చేనేత సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ ప్రస్తుతం వైసిపి చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
గతంలో ఆయన సోదరుడు సీతారాం వార్డు సభ్యుడిగా పనిచేశారు. ఆయన వదిన పోరాలు శిల్ప రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించారు.







కామెంట్లు (0)