ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు టిడిపి అభ్యర్థిగా టంకశాల హనుమంతును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఆయన 29వ వార్డు సభ్యుడిగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టిడిపి క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న హనుమంతు కుర్ని చేనేత సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిరీత్యా గార్మెంట్స్ తయారీ వ్యాపారంలో ఉన్న ఆయన రాయదుర్గం రెడీమేడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
రాయదుర్గం టిడిపి చైర్మన్ అభ్యర్థిగా టంకశాల హనుమంతు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)