గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పదేళ్ల తరువాత క్రిస్టియానో రొనాల్డో, జార్జినా రోడ్రిగ్జ్ వివాహం

1 రోజు క్రితం

riyonld
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రైవేట్ వేడుకలో ఒక్కటైన స్టార్ జంట

లిస్బన్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఆయన చిరకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు పదేళ్లుగా కలిసి ఉన్న ఈ జంట మంగళవారం పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో జరిగిన ప్రైవేట్ సివిల్ వేడుకలో భార్యాభర్తలుగా మారారు. పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు సమీపంలోని పశ్చిమ తీర ప్రాంత పట్టణమైన కాస్కైస్‌లో ఈ వేడుక జరిగినట్లు బ్రన్స్‌విక్ గ్రూప్ వెల్లడించింది. వివాహం అనంతరం రొనాల్డో, జార్జినా తమ ఉంగరాలను ప్రదర్శిస్తున్న ఫొటోను సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఈ ఫొటో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మాడ్రిడ్‌లో పరిచయమైన రొనాల్డో, జార్జినా దాదాపు దశాబ్ద కాలంగా కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు వివాహంతో తమ బంధాన్ని అధికారికంగా మార్చుకున్నారు. 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఐదుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన ఫుట్‌బాల్ దిగ్గజం. పోర్చుగల్ తరఫున రికార్డు స్థాయిలో తన ఆరో ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆయన.. క్లబ్ స్థాయిలో సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అల్ నస్ర్ తన దేశీయ సీజన్‌ను ఆగస్టు 15న ప్రారంభించనుంది. వివాహ వేడుక అనంతరం రొనాల్డో మరోసారి ఫుట్‌బాల్ మైదానంలో బరిలోకి దిగనున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్