విశాఖపట్నం : ఏనుగుల కారణంగా జరిగే ప్రమాదాలను 70శాతం వరకు తగ్గించగలిగామని ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విశాఖలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏనుగులు అడవులసంరక్షణ, జీవవైవిధ్యానికి కాపలాదారులని అన్నారు. దేశ వారసత్వానికి ప్రతీకలని అన్నారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు చర్యలు చేపట్టామని అన్నారు. 2014 నుండి ఏనుగుల రిజర్వుల సంఖ్య 26 నుండి 33కు చేరిందని అన్నారు. 150 ఏనుగుల కారిడార్లను గుర్తించి రక్షణ కల్పించామని అన్నారు. ఏపిలో ప్రస్తుతం సుమారు వందకు పైగా అడవి ఏనుగులు ఉన్నాయని అన్నారు.
‘ప్రపంచ ఏనుగుల దినోత్సవ’ కార్యక్రమానికి హాజరైన పవన్‌కళ్యాణ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 06:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)