చండీఘర్ : శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్‌పై గురువారం దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన చేతికి గాయమైంది. ఆయనను రక్షించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కి కూడా గాయాలయ్యాయి.
దాడికి పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేపడుతున్నట్లు నాందేడ్ కలెక్టర్ రాహుల్ కర్డైల్ ఒక ప్రకటనలో తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు నిహాంగ్ (అకాలీ), కిర్పాన్ (ఒకరకమైన కత్తి) ధరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. పలు గురుద్వారాలను సందర్శిస్తున్న ఆయన నాందేడ్ జిల్లాలోని మాతా సాహిబ్ గురుద్వారాను చేరుకున్నారని, అదే సమయంలో ఆయనపై ఈ దాడి జరిగిందని అన్నారు. దాడి సమయంలో సుఖ్బీర్ బాదల్ భార్య, లోక్‌సభ ఎంపి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా పక్కనే ఉన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు.
శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్‌పై దాడి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)