ప్రజాశక్తి -రాజమహేంద్రవరం : లాలాచెరువు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయిని మోటూరి మంగారాణి ఫిన్‌లాండ్‌లో నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమానికి బయలుదేరారు. ఈ మేరకు ఆమెకు అధికారులు రిలీవింగ్ ఉత్తర్వులు అందజేశారు. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్‌లాండ్‌లో ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN) శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంగారాణి పాల్గొననున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫిన్‌లాండ్ శిక్షణకు ఎంపికైన మంగారాణిని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు, విద్యాశాఖ కార్యాలయ ఏ.డీ. వెంకటరాజు, అర్బన్ ఎంఈఓ ఎం.వి.ఎం. సుబ్రహ్మణ్యం, ఎంఈఓ-2 రమారజని, లాలాచెరువు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని యు.విజయలక్ష్మి అభినందించారు.
ఫిన్‌లాండ్‌లో శిక్షణకు మంగారాణి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)