హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సార్‌బ్రూకెన్(జర్మనీ): హైలో ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ ఫైనల్లోకి పివి సింధు, లక్ష్య సేన్ ప్రవేశించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు వరుససెట్లలో భారత్‌కే చెందిన అన్మోల్ ఖర్భ్‌ను 21-13, 21-16తో చిత్తుచేసింది. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న సింధుకు రెండో గేమ్‌లో అనూహ్యంగా ప్రతిఘటన ఎదురైంది. కానీ రెండో అర్ధభాగం నుంచి 4 పాయింట్ల ఆధిక్యతను సంపాదించిన సింధు.. అదే ఆధిక్యతను చివరి వరకు నిలుపుకొని మ్యాచ్‌ను ముగించింది. మరో సెమీస్‌లో టాప్‌సీడ్, మలేషియాకు చెందిన టాప్‌సీడ్ ఛోఛువాంగ్‌కు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. గంటా 22 నిమిషాలసేపు సాగిన ఈ గేమ్‌లో ఛో ఛువాంగ్ 21-8, 19-21, 26-28తో 8వ సీడ్, డెన్మార్క్‌కు చెందిన లినే ఖార్జెషెల్ట్ చేతిలో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 7వ సీడ్ లక్ష్య సేన్ 21-17, 21-13తో 6వ సీడ్ పొపోవ్(ఫ్రాన్స్)ను ఓడించాడు.








కామెంట్‌లు (0)