గౌహతి చేరుకున్న భారత్, వెస్టిండీస్ జట్లు
రేపు ఇరుజట్ల మధ్య రెండో వన్డే
గౌహతి: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారతజట్టు సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో బుధవారం జరిగే రెండో వన్డే కోసం ఇరుజట్లు సోమవారం గువాహటి చేరుకున్నారు. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా.. గౌహతిలోనూ వెస్టిండీస్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు భారత గడ్డపై 24 ఏళ్లలో ఒక్క వన్డే సిరీస్ గెలవని విండీస్ పుంజుకోవాలని చూస్తోంది. దాంతో.. రెండో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ(139 నాటౌట్), శుభ్‌మన్ గిల్(110) శతకాలతో మెరిసారు. రెండో వన్డేకోసం గౌహతి చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో పోగైన అభిమానులు ఇరుజట్ల ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం పలికారు. ఆపై బస చేసే హోటల్ సిబ్బంది సైతం అదిరిపోయేలా వెల్‌కమ్ చెప్పారు. టీమ్ బస్సులో వెళ్తుండగా ఫ్యాన్స్ పోటీపడి తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు పోటీపడ్డారు. వన్డే సన్నద్ధతలో భాగంగా మంగళవారం నెట్స్ ప్రాక్టీస్‌లో పాల్గోనున్నారు. బర్సపర క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలున్నాయి. బౌలర్లకు కాస్త బౌన్స్ లభించినా.. బ్యాటర్లదే ఆధిపత్యం.







కామెంట్‌లు (0)