ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో వైద్య విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్‌కు చెందిన శ్రావణి... విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. చినవాల్తేరులోని ఓ ఇంటిలో అద్దెకుంటూ కళాశాలకు వెళ్లి వస్తుండేవారు. సోమవారం ఆమె తన గది నుంచి బయటికి రాలేదు. బయటి నుంచి పిలిచినా స్పందించక పోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శకుంతల సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి ఉరికి వేలాడుతూ శ్రావణి కనిపించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కెజిహెచ్‌కు తరలించారు. శ్రావణి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్రావణి మృతితో కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యా రు. నాలుగు రోజుల క్రితం విశాఖ రామ్‌నగర్‌లో వైద్య విద్యార్థిని పెదిరెడ్ల శైలజ ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరువకముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది.
Print Editionమరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)