సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసచివాలయ ఉద్యోగులపై నిర్బంధం ఆపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

1 గంట క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అక్రమ సస్పెన్షన్స్, కేసులు ఎత్తేయాలి

  • సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : తమ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆదివారం నాడు తమ కోర్కెలపై చలో విజయవాడకు వస్తున్న, వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అనుమతించాల్సింది పోయి శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని వెంటాడి వేటాడి కొట్టడం, తరమడం, అరెస్టు చేయడం లాంటి బీభత్స చర్యలను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధర్నాలో పాల్గొన్నారన్న పేరుతో సస్పెన్షన్స్ చేస్తున్నారని, బెదిరిస్తున్నారని, ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం పట్ల వారిలో వ్యతిరేకత, ఆగ్రహం పెరగడం తప్ప సాధించేందేమీ ఉండదని తెలిపారు. ఈ పాటికే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టీపట్ట నట్లు వ్యవహరించడమేకాక కక్షతో వ్యవహరించ ిందని, ఇప్పటికైనా కళ్లుతెరిచి సంఘ నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయ సమ్మతమైన సమస్యల ను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేడర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తూ జిఓను ఎట్టకేలకు జారీ చేసిందని, మంచిదే కానీ ఇతర సమస్యలేవీ పరిష్కరించలేదని అన్నారు. వాటన్నిటినీ వెంటనే సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం లో నూతనంగా ఉద్యోగంలో చేరిన నుండి నేటి వరకు ప్రభుత్వాలు వారి సమస్యలను పరిష్కరిం చడంలో నిర్లక్ష్యం చూపడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం నిర్వహించే చలో విజయ వాడ శాంతియుత నిరసన కార్యక్రమం అనుమతి కోసం 10 రోజుల ముందే దరఖాస్తు పెట్టుకున్న ప్పటికీ పోలీసు అధికారులు అనుమతి ఇవ్వకపోవ డం వల్ల వారు ఒక్కసారిగా ధర్నాచౌక్‌‌కు చేరుకొని నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వారిని బలవంతగా ఈడ్చిపడేసి అరెస్టు చేయడం, మహిళా ఉద్యోగులని చూడ కుండా లాగి కొట్టి జీపుల్లో ఎక్కించడం దుర్మార్గమని విమర్శించారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులపై విధించిన సస్పెన్షన్‌‌ను ఎత్తివే యాలని, చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై కేసులు పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని, సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్