బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND vs WI : సిరీస్‌ కైవసంపై గురి

2 గంటల క్రితం

team india.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:47 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేడు హైదరాబాద్‌ వేదికగా

  • వెస్టిండీస్‌తో నాల్గో టి20

  • రాత్రి 7.00గం.ల నుంచి

హైదరాబాద్‌: ఐదు టి20ల సిరీస్‌లో ఆధిక్యతలో ఉన్న టీమిండియా.. ఇక సిరీస్‌ గెలుపుపై దృష్టి సారించింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో బుధవారం జరిగే నాల్గో టి20లో టిమిండియా గెలిస్తే సిరీస్‌ కైవసం చేసుకోనుంది. ఇండోర్‌లో జరిగిన మూడో టి20లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఐదు టిల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. తెలుగు కుర్రాళ్లు తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం, హైదరాబాద్‌లో కీలక మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా.. పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది. హైదరాబాద్ టీ20లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండోర్‌లో సంజు పరుగులు చేయలేకపోయినా.. రాంచీలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. హైదరాబాద్ మైదానంలోనూ అతడికి మంచి రికార్డు ఉండటంతో అతడే బరినలోకి దిగనున్నాడు. దాంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానున్నారు. ఈ టాప్ ఆర్డర్‌పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే కీలక సమయంలో బ్యాటర్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు కాబట్టి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడగలరు. గత మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్యాట్, బంతితో రాణించడంతో హైదరాబాద్‌లోనూ ఆల్‌రౌండర్లపైనే జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచే అవకాశముంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాస్త పెద్ద మైదానం కావడంతో బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ప్రిన్స్ యాదవ్‌ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు.

రెండు మార్పులతో టీమిండియా..

నాల్గో టి20కి టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. శివమ్‌ దూబే స్థానంలో కుల్దీప్‌, ప్రిన్స్‌ యాదవ్‌ స్థానంలో నితీశ్‌ కుమార్‌కు చోటు దక్కే ఛాన్స్‌ ఉంది. నితీశ్‌ కుమార్‌కు ఇది సొంత మైదానం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఈ మైదానంలో ఇప్పటివరకు 3టి20 మ్యాచ్‌లు జరగ్గా.. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఒకసారి, బౌలింగ్‌ ఎంచుకున్న జట్టు రెండుసార్లు విజయాలను నమోదు చేసుకున్నారు. ఈ మైదానంలో 230 పరుగుల అత్యధిక స్కోర్‌ కాగా.. తొలిగా బ్యాటింగ్‌కు దిగి 180కు పైగా పరుగులు చేస్తే.. ఛేదనకు దిగే జట్టు విజయానికి చెమటోడ్చాల్సిందే.

జట్లు(అంచనా):

ఇండియా: శ్రేయస్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్‌: హోప్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కమిల్‌ పూరన్‌, హెట్‌మైర్‌, రోవన్‌ పావెల్‌, రూథర్డ్‌ఫోర్డు, సంప్సన్‌, కీమో పాల్‌, స్ప్రింగర్‌, రోస్టన్‌ ఛేస్‌, జోసెఫ్‌, మోటీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్