బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు రద్దు

1 గంట క్రితం

cancell
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 07:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అక్టోబర్ 17 వరకు నిలిపివేత

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని పలు నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను అక్టోబర్ 17 వరకు రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థల విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. రియాద్, జెడ్డా, దమ్మామ్ వంటి నగరాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. మదీనా మార్గంలోనూ కొన్ని విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి.

సౌదీ అరేబియాలో భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ విమాన సంస్థలను సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలని సూచించారు. విమానాల రద్దు కారణంగా ప్రయాణ తేదీల మార్పు లేదా టికెట్ డబ్బుల వాపసు గురించి ఆయా సంస్థలను సంప్రదించవచ్చు. పరిస్థితులను సమీక్షించిన తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణపై సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్