ఆస్ట్రేలియా-ఎ 171 ఆలౌట్
పుదుచ్చేరి: ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో ఇండియా-ఎ జట్టుకు 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైనా.. అనంతరం ఆస్ట్రేలియా-ఎను తొలి ఇన్నింగ్స్‌లో 171పరుగులకే పరిమితం చేసింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (25), జేసన్ సంఘా (46), ఆల్‌రౌండర్ లియామ్ స్కాట్(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 55.3 ఓవర్లలో 171 పరుగులకు ముగిసింది. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ రెండు, పేసర్లు దేశ్ పాండే రెండు, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.








కామెంట్‌లు (0)