గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫలితాలపై దృష్టి సారించండి

55 నిమిషాల క్రితం

Minister Lokesh spoke with Indian Embassy officials regarding the boat accident.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అధికారులతో విద్యాశాఖ మంత్రి లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక అధికారులంతా ఫలితాలపైనే పూర్తిగా దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. టెన్త్, ఇంటర్మీడియట్‌లలో 90 శాతం ఫలితాల సాధన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి ‌లోకేష్‌ ‌తెలిపారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం మెరుగుదలకు ఎఫ్ఆర్ఎస్‌ను అమలు చేయాలని సూచించారు. పాఠ్యాంశాల బోధనలో వెనుకబడిన సబ్జెక్టు టీచర్లకు మెంటార్ టీచర్లతో కెపాసిటీ బిల్డింగ్ తప్పనిసరి చేయాలన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాది చివరికి నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని, నిర్ణీత లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నివారించేందుకు పెద్దయెత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పిఎం సేతు పథకం ద్వారా పారిశ్రామికవేత్తల సహకారంతో తొలి విడతగా 10 పారిశ్రామిక అనుసంధానిత ఐటిఐ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మానవవనరులశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ డైరెక్టరు నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టరు రంజిత్ బాషా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష డైరెక్టరు ‌బి శ్రీనివాసరావు, స్కిల్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ఎమ్‌డి గణేష్‌, ఉన్నత విద్యామండలి ఇన్‌‌ఛార్జి ఛైర్మన్‌ ‌విజయభాస్కర్‌, విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఎమ్‌‌డి దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్