గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition నిర్ణయాల వివరాలను ఇసి వెల్లడించాల్సిందే...!

44 నిమిషాల క్రితం

ec.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​న్యూఢిల్లీ :తాము తీసుకున్న నిర్ణయాలకు మెజారిటీ మద్దతు ఉందా.. లేదా.. అనే వివరాలను ఎన్నికల కమిషన్‌ వెల్లడించాల్సిందేనని ఆ సంస్థకు చెందిన ముగ్గురు మాజీ కమిషనర్లు స్పష్టం చేశారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రస్తుత సిఇసి జ్ఞానేష్‌‌కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని వార్తలు వస్తున్న సమయంలో మాజీ ఎన్నికల కమిషనర్లు ఈ విధంగా స్పందించారు. ఏకపక్షంగా లేదా మెజారిటీ మద్దతు లేకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) మాజీ ప్రధాన కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తెలిపారు. ‘‘ కమిషన్‌ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయంతో కూడినవిగా ఉండాలి. ఎన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్ని మెజారిటీ మద్దతుతో తీసుకున్నారు అనే వివరాలన్నింటినీ ఇప్పుడు బహిర్గతం చేయాలి,’’ అని ఆయన అన్నారు. మరో మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా మాట్లాడుతూ కమిషన్‌ ‌తీసుకున్న అన్ని నిర్ణయాల వివరాలను వెల్లడించాలని తెలిపారు. ఇసి నిర్ణయాల్లో తాము భాగం కాలేదని ఇద్దరు కమిషనర్లు చెప్పడం తీవ్రమైన విషయంగా లావాసా పేర్కొన్నారు. మరొక మాజీ సిఇసి అయిన ఒపి రావత్ మాట్లాడుతూ నిర్ణయాల్లో తాము భాగం కాలేదని ఇద్దరు కమిషనర్లు 10 నెలల తరువాత వెల్లడించడాన్ని తప్పు బట్టారు. ఎన్నికల సంఘానికి పూర్తి స్వతంత్రత వుందని, కాబట్టి ఏదైనా తప్పు జరుగుతోందని అనిపిస్తే, వెంటనే ఆ విషయాన్ని బహిర్గతం చేయాలని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్