శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ZIMW Vs INDW:రాణించిన భారత బౌలర్లు.. జింబాబే 197 ఆలౌట్‌

17 నిమిషాల క్రితం

India Women vs Zimbabwe Women, 1st ODI, Zimbabwe Women tour of India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ బౌలర్లు అదరగొట్టారు. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ లక్ష్యం 198 పరుగులుగా ఉంది. బెలోవెడ్‌ బిజా (62) హాఫ్‌ సెంచరీ సాధించింది. మోడెస్టర్ ముపాచిక్వా (25), చిపో ముగేరి-తిరిపానో (21), మిచెల్ మవుంగ్ (29) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో లోరిన్ ఫిరి (1), , షార్నే మేయర్స్ (8), న్యాషా గ్వాన్‌జురా (13), చిడ్జా ధురురు (10), , నొమ్‌వెలో సిబాండా (2), చరే మకులిషాండర్ (2), చరే (4) పూర్తిగా విఫలమాయ్యరు.

భారత బౌలర్లలో తెలుగు అమ్మాయి శ్రీ చరణి (4/23) అద్భుత స్పెల్‌ వేసింది. ఆమెతోపాటు క్రాంతి గౌడ్ (3/42), దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ ఒక వికెట్ తీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్