నేడు 5వ స్థానానికి జర్మనీతో ఢీ
ఆమ్‌స్టెల్‌వీన్: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరడంలో విఫలమైన భారత మహిళల జట్టు అత్యుత్తమ స్థానానికి పోటీ పడనుంది. రెండోరౌండ్ గ్రూప్-ఇలో 3వ స్థానంలో నిలిచిన భారత జట్టు గ్రూప్-ఎఫ్‌లో 3వ స్థానంలో ఉన్న జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 5వ స్థానం ఖరారు కానుండగా.. భారత మహిళల జట్టు రెండోరౌండ్‌లో అద్భుతంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. పటిష్ట ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ను 0-0తో నిలువరించిన అమ్మాయిలు.. ఆతిథ్య నెదర్లాండ్స్ చేతిలో 3-1తో ఓటమితో సెమీస్‌కు దూరమయ్యారు. దీంతో గురువారం జరిగే కీలక పోరులో భారత మహిళలజట్టు జర్మనీని ఓడిస్తే.. ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో భారత్ అత్యుత్తమ స్థానంలో నిలువనుంది.







కామెంట్‌లు (0)