మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟕: ఢిల్లీ హెడ్‌కోచ్‌గా గంగూలీ

13 గంటల క్రితం

dada.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 02:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని జట్టు హెడ్‌కోచ్‌గా నియమించింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ఫ్రాంచైజీకి డైర‌క్ట‌రేట్ ఆఫ్ క్రికెట్‌గా పురుషుల, మహిళల జట్టుకు సేవ‌లందిస్తోన్న గంగూలీ.. ఇక‌పై జ‌ట్టు హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు. అయితే గంగూలీ ఐపీఎల్‌ కోచ్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. గతంలో ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా గంగూలీ సేవలందించారు. 2008 నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేదు. 2019, 2021లో ప్లేఆఫ్స్‌కు, 2020లో ఫైనల్‌కు చేరినా టైటిల్‌ను అందుకోలేకపోయింది. గంగూలీతో పాటు ఇతర దిగ్గజాల రాకతో 2027లోనైనా తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆశిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్