సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌కు ఇషా సింగ్ అర్హత

1 గంట క్రితం

pistol
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నగోయా: షూటింగ్‌లో భారత్‌కు చెందిన ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో 580 పాయింట్లు సాధించిన ఇషా ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పతకం సాధించే ఆశలను ఆమె సజీవంగా ఉంచింది. అయితే, క్వాలిఫయింగ్‌లో ఇతర భారత షూటర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జట్టు విభాగంలో భారత్‌కు పతకం దక్కే అవకాశం చేజారింది. మను భాకర్ 579 పాయింట్లతో 11వ స్థానంలో, రాహి సర్నోబత్ 568 పాయింట్లతో 30వ స్థానంలో నిలిచారు. తొలి ర్యాపిడ్ సిరీస్‌లో రాహి సర్నోబత్ కొట్టిన ఓ షాట్ టార్గెట్ ఫ్రేమ్‌ను తాకడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. దీంతో టీమ్ ఈవెంట్‌లో భారత్ పతక పోరు నుంచి నిష్క్రమించింది. ఇక ఫైనల్‌కు అర్హత సాధించిన ఇషా సింగ్‌పై భారత అభిమానుల దృష్టి నిలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ ఉదయం 10.45 గంటలకు జరగనుంది. క్వాలిఫయింగ్‌లో చూపిన ప్రదర్శనను ఫైనల్‌లోనూ కొనసాగించి పతకం సాధించాలని ఇషా లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్