ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది....

1 గంట క్రితం

It depends on fitness
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. వచ్చే ఎడిషన్‌లోనైనా (ఐపిఎల్-2027) అతడి ఆట చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ధోని స్పందించారు. బెంగళూరులో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను వచ్చే సీజన్‌లో ఆడతారా? అని ప్రశ్నించగా.. అది తన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ధోని పరోక్షంగా చెప్పారు. ‘‘నేను ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకోవాలి. డిసెంబర్‌లోపు మీరు నాకు రిపోర్ట్‌ ఇవ్వాలి. నేను మరో సీజన్ ఆడేంత దృఢంగా ఉన్నానో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ‘ఈ పాత వాహనం మళ్లీ రోడ్డుపై సజావుగా నడిచేలా మీరే జాగ్రత్త వహించాలి’. కాబట్టి మొత్తం బాధ్యత మీదే’’ అని ధోని సరదాగా వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్