ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionNZ vs IND, 1st ODI: నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌..

19 నిమిషాల క్రితం

NZ vs IND, 5th ODI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 09:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మౌంట్‌ మాంగనూయ్‌: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 17.2 ఓవర్లకు 86 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.

భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 13 బంతుల్లో ఒక ఫోర్‌తో 7 పరుగులు చేసి 5.3వ ఓవర్‌లో ఫిషర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 7.3వ ఓవర్‌లో ఫిషర్‌ బౌలింగ్‌లో 5 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

అనంతరం రుతురాజ్‌ గైక్వాడ్‌ (18) కూడా 8.1వ ఓవర్‌లో డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 34 పరుగులకే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఇక నాలుగో వికెట్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ (22) వెనుదిరిగాడు. 17.2వ ఓవర్‌లో టిక్నర్‌ బౌలింగ్‌లో ఫిషర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. భారత జట్టులో మహమ్మద్‌ సిరాజ్‌ తిరిగి జట్టులోకి రాగా, యశ్‌ ఠాకూర్‌ అరంగేట్రం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌ జట్టులో డఫీ, టిక్నర్‌ చోటు దక్కించుకున్నారు.

భారత తుది జట్టు: రోహిత్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌, అఖిబ్‌ నబీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, యశ్‌ ఠాకూర్‌.

న్యూజిలాండ్‌ తుది జట్టు: విల్‌ యంగ్‌, టిమ్‌ సీఫెర్ట్‌ (వికెట్‌ కీపర్‌), నిక్‌ కెల్లీ, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, ఫిన్‌ అలెన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), క్రిస్టియన్‌ క్లార్క్‌, బ్లెయిర్‌ టిక్నర్‌, జాకబ్‌ డఫీ, మాథ్యూ ఫిషర్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్