ప్రజాశక్తి-విజయవాడ: ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రల్లో తనదైన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఘనత గిరిబాబుకు దక్కుతుందని పేర్కొన్నారు. గిరిబాబు ఎంతో సౌమ్యుడని, అందరితో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తి అని కొనియాడారు. తన స్వగ్రామ అభివృద్ధికి కూడా ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. గ్రామ ప్రజలతో ఒకరిగా కలిసిపోయి, వారి అభ్యున్నతికి తోడ్పడిన విలక్షణ వ్యక్తి అని గుర్తుచేశారు. గిరిబాబు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు వి. శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నటుడు గిరిబాబు మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం
16 నిమిషాల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 09:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)