ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమేమూ సమాజానికి ఉపయోగపడతాం!

31 నిమిషాల క్రితం

సాయం.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 09:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా ఉపాధ్యాయుడు తగరం ఆనంద్‌కుమార్‌ ఉపాధ్యాయ వృత్తికి అంకితమై పనిచేస్తూ, విద్యతోపాటు సామాజిక సేవకు ప్రాధాన్యమివ్వడం అభినందనీయం. పిల్లలకు విద్యను అందించడమే కాకుండా సమాజానికి కూడా తనవంతు మేలు చేయాలనే ఆయన ఆలోచన మాకు స్ఫూర్తినిస్తుంది. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థుల సహకారంతో సమాజంలో పేద విద్యార్థులకు, వృద్ధులకు, వృద్ధాశ్రమాలకు, హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలబడ్డారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ప్రజలంతా కలిసి పనిచేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని నమ్మి సేవ చేయడం మా మాస్టారు స్థాపించిన ‘‘వారధి ఫౌండేషన్’’ ప్రత్యేకత. అందుకే ఈ ఫౌండేషన్ మాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే సామాజిక సేవకు సమయం కేటాయించడం ఆయనలోని సేవాభావాన్ని తెలియజేస్తుంది. సమాజానికి ఉపయోగపడాలనే తపనతో పనిచేసే ఇలాంటి వ్యక్తులు మరింతమందికి ఆదర్శంగా నిలుస్తారు. విద్యార్థులమైన మేము పుస్తకాల్లోని పాఠాలనే కాకుండా, మా చుట్టూ ఉన్నవారి మంచిపనుల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇతరులకు సహాయం చేయడం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండడం వంటి విలువలు చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలి. మా ఉపాధ్యాయుడు తగరం ఆనంద్‌కుమార్‌ ఉపాధ్యాయ వృత్తితోపాటు వారధి ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవకు కృషి చేయడం మాకు మంచి ఉదాహరణ. ఆయనను చూసి మేము కూడా భవిష్యత్తులో చదువులో రాణించడంతోపాటు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని అనుకుంటున్నాం.

బండ్ల

బండ్ల అక్షిత్‌ 5వ తరగతి,

ఎంపీపీ ఎస్సీ స్కూల్‌,

దాచేపల్లి, పల్నాడు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్