హాయ్ ఫ్రెండ్స్!
ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది. మా ఇంటి దగ్గర, వీధుల్లో ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలు పడేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి, నీరు సరిగా పారడం లేదు. దీనివల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులు వాడాలని మా ఇంట్లో చెబుతుంటాను. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తబుట్టలో వేయాలని నా స్నేహితులకు కూడా సూచిస్తాను. నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ బాటిళ్లను ఉపయోగించాలి. ప్లాస్టిక్ వస్తువులను కాల్చకూడదు. వాటివల్ల వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది.
మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే భూమిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండాలంటే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి. ప్రకృతిని ప్రేమిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!

గోట్రు శామ్యూల్ ఆష్
3వ తరగతి, విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల,
భట్టిప్రోలు, బాపట్ల జిల్లా.






కామెంట్‌లు (0)