ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు శ్రీలంక

4 రోజుల క్రితం

sl vs pak.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 10:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు

లాహోర్‌: పాకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు శ్రీలంక చేరింది. మంగళవారం జరిగిన కీలక పోరులో శ్రీలంక జట్లు 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ను దిల్షన్‌ మధుషంక (5/34)కి తోడు సహాన్‌ అరచ్చిగే (2/24), ఎషాన్‌ మలింగ, అషిత ఫెర్నాండో, వెల్లాలగే ఒక్కో వికెట్‌తో రాణించారు. దీంతో పాకిస్తాన్‌ 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. బాబర్‌ ఆజం (29), హసన్‌ నవాజ్‌ (17), అరాఫత్‌ మిన్హాస్‌ (10), షాహీన్‌ అఫ్రిది (15) మినహా ఎవరూ రెండంకెల స్కోర్‌ సాధించలేదు. స్వల్ప లక్ష్య ఛేదనను శ్రీలంక ఓపెనర్‌ కమిందు మెండిస్‌ (62) అజేయ అర్ద శతకంతో లంకను విజయతీరాలకు చేర్చాడు. ఫెర్నాండో (16), మెండిస్‌ (8) తక్కువ స్కోర్లకే ఔటైనా, పవన్‌ రత్నాయకే (23 నాటౌట్‌) సునాయాస విజయాన్నిందించాడు. ఈ గెలుపుతో శ్రీలంక ఫైనల్‌కు చేరగా.. ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 31న ఫైనల్‌ జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్