సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరానీ కప్‌ ‌విజేతగా ‘రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’

1 గంట క్రితం

story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఇరానీ కప్‌ విజేతగా ‘రెస్ట్‌ ఆఫ్ ఇండియా’ నిలిచింది. ఫైనల్‌లో జమ్ము కశ్మీర్‌పై 167 పరుగుల తేడాతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా విజయం సాధించింది. ఈ జట్టుకు రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆర్‌ఒఐ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్య ఛేదనలో 111 పరుగులకే జమ్ము కశ్మీర్ టీమ్‌ కుప్పకూలింది. ముకేశ్‌ కుమార్ (8 వికెట్లు), ఆకాశ్‌ దీప్ (6 వికెట్లు), ముకేశ్‌ చౌదరి (6 వికెట్లు) బౌలింగ్‌లో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ ఆఫ్ ఇండియా 237 పరుగులు చేయగా.. జమ్ము కశ్మీర్‌ 278 రన్స్‌ చేసి లీడ్ సాధించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్‌ జట్టు 319 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్‌ కోల్పోయినా సరే రెస్ట్ ఆఫ్ ఇండియా విజయం సాధించి కప్పును ఎగరేసుకుపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్మరణ్‌ రవిచంద్రన్ (68, 135 పరుగులు) నిలిచాడు. గత రెండు సార్లు ఇరానీ ట్రోఫీని ముంబయి, విదర్భ గెలుచుకున్నాయి.

రెండో ఇన్నింగ్స్‌లో ఆ తప్పులు చేయలేదు : పంత్

‘మ్యాచ్‌ గెలిచాక.. అప్పటి వరకూ మనం పడిన బాధలు, కష్టాలు మరిచిపోతాం. తొలి ఇన్నింగ్స్‌ నుంచి మేం ఫుల్లర్ డెలివరీలతో ఇబ్బంది పెట్టాలని చూశాం. కానీ, అలా చేయలేకపోయాం. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గత పొరపాట్ల నుంచి నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్భుతం చేశారు. బ్యాటింగ్‌లో స్మరణ్‌ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు’ అని కెప్టెన్ రిషభ్‌ పంత్ వెల్లడించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్