సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ‘జల్‌జీవన్‌ మిషన్‌’ ప్రారంభం

58 నిమిషాల క్రితం

jal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 06:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రారంభించనున్న సిఎం, డిప్యూటీ సిఎం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ 2.0-అమరజీవి జలధార’ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఎంఎం పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌ప్రారంభించనున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇంటి వద్దే సురక్షితమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పనులను చేపడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 4,933 ఆవాసాల్లో 7.44 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లను అందించిందని రాష్ట్రప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అమరజీవి జలధార ద్వారా మరో 27 లక్షల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. రూ.30,156 కోట్లతో చేపట్టనున్న పనులను ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇంటి వద్దే సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అమలు చేయనుందని వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్