లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్ లీగ్’లో భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్ గాయపడింది. తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది. దాంతో.. ఈ నెలాఖరులో జరిగే ఆసియా కప్‌లో జెమీమా ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ది హండ్రెడ్ లీగ్‌లో సథర్న్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెటర్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ‘ది హండ్రెడ్ లీగ్’కు జెమీమాను సథర్న్ బ్రేవ్ జట్టు రూ.76 లక్షలకు కొనుగోలు చేసింది. ఆమె స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను ఆ ఫ్రాంచైజీ రీప్లేస్‌మెంట్ చేసుకుంది. అయితే.. త్వరలోనే యూఏఈ వేదికగా ఆసియా కప్ షురూ కానుంది. ఆసియా క్రికెట్ మండలి(ఎసిఎ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28 నుంచి ఆసియా కప్ మొదలవ్వనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది. ఈ లీగ్‌లో భాగంగా ఆడిన ఆరు మ్యాచుల్లో 143 పరుగులతో రాణించింది. రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న జెమీమా.. సథర్న్ బ్రేవ్ జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగడంలో కీలకమైంది.
రోడ్రిగ్స్ ఆసియా కప్ కు దూరం?
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)