న్యూయార్క్: యువ గ్రాండ్ మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద మరో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక జిసిటి సెయింట్ లూసియా ర్యాపిడ్, బ్లిట్జ్-2026 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన చివరి రౌండ్‌లో జావోఖిర్ సిందరోవ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో ప్రజ్ఞానంద మొత్తం 23.5 పాయింట్లతో విజేతగా నిలిచారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ప్రజ్ఞానంద తొలిరౌండ్ నుంచి ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. చివరి రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ గట్టి పోటీనిచ్చినప్పటికీ 1.5 పాయింట్ల ఆధిక్యతలో నిలిచాడు. సిందరోవ్ మాట్లాడుతూ.. చివరి గేమ్ వరకు పోరాడినా.. ప్రజ్ఞానంద బాగా ఆడాడని, అదృష్టం తోడైందని తెలిపాడు. ఆగస్టు 10న ప్రారంభమయ్యే ‘సింక్విఫీల్డ్ కప్’తో సిజిటి సీజన్ ముగియనుంది.
సెయింట్ లూసియా చెస్ విజేత ప్రజ్ఞానంద
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)