శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రీ క్వార్టర్స్‌‌కు షెల్టన్‌, సిట్సిపాస్‌

2 గంటల క్రితం

tennis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ పురుషుల సింగిల్స్‌ ‌ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్లోకి 8వ సీడ్‌, అమెరికాకు చెందిన షెల్టన్‌, అన్‌‌సీడెడ్‌ ‌గ్రీక్‌‌కు చెందిన షెల్టన్‌ ‌ప్రవేశించారు. శనివారం జరిగిన మూడోరౌండ్‌ ‌పోటీలో షెల్టన్‌ 7-6(7-3), 6-7(5-7), 6-3, 6-4తో కెనడాకు చెందిన అన్‌‌సీడెడ్‌ ‌షపోవలోవ్‌‌ను చిత్తుచేయగా.. మరో పోటీలో సిట్సిపాస్‌ 2-6, 6-1, 7-6(7-3), 6-1తో 18వ సీడ్‌, లెహెక్కా(చెక్‌)‌ను ఓడించి సంచలనం నమోదు చేశాడు. ఇక 27వ సీడ్‌ అర్జెంటీనాకు చెందిన ఎచెవెర్రి 6-4, 6-4, 6-3తో తన దేశానికే చెందిన నవోన్‌‌ను ఓడించాడు. మరో పోటీలో 11వ సీడ్‌ అమెరికాకు చెందిన టఫీ 6-4, 6-2, 6-4తో 22వ సీడ్‌ ‌వలెంటీన్‌‌ను చిత్తుచేశాడు. ఇక మహిళల సింగిల్స్‌ ‌ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్లోకి 6వ సీడ్‌ ‌నోస్కోవా(చెక్‌), 21వ సీడ్‌, కలిన్స్కయా(రష్యా) ప్రవేశించారు. మూడోరౌండ్‌‌లో కలిన్స్కయా 6-3, 2-6, 6-3తో 9వ సీడ్‌, స్విటోలినా(ఉక్రెయిన్‌)‌ను, నోస్కోవా 6-2, 6-7(6-7), 6-2తో అమెరికాకు చెందిన 29వ సీడ్‌ లీను ఓడించారు. ఆరు మ్యాచ్‌ ‌పాయింట్లు ఎదుర్కొని గెలిచిన బాలాజీ జంట పురుషుల డబుల్స్‌‌లో శ్రీరాం బాలాజీ-ఇవాన్‌ ‌కింగ్‌(అమెరికా) జంట ఆరు మ్యాచ్‌ ‌పాయింట్లు ఎదుర్కొని మరీ తొలి రౌండ్‌‌లో విజయం సాధించారు. శనివారం జరిగిన తొలిరౌండ్‌ ‌గేమ్‌‌లో బాలాజీ-ఇవాన్‌ ‌కింగ్‌ 3-6, 7-6(7-5), 7-6(10-8) నెదర్లాండ్స్‌ కు చెందిన సండెర్‌ అరెండ్స్‌, డేవిడ్‌ ‌పెల్‌ ‌జంటను ఓడించి రెండోరౌండ్‌‌కు చేరారు. ఈ మ్యాచ్‌ ‌సుమారు గంటా 56నిమిషాలసేపు సాగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్