తిరువనంతపురం : సిఎంఆర్ఎల్ - ఎక్సలాజిక్ ఆరోపణలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పినరయి విజయన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు సోమవారం విచారించనుంది. రూ. 2.78 కోట్ల చెల్లింపులకు సంబంధించిన ఈ కేసులో, పినరయి విజయన్, ఆయన కుమార్తె టి. వీణ, అల్లుడు మహమ్మద్ రియాస్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేసేందుకు విజయన్‌కు డివిజన్ బెంచ్ అనుమతి నిరాకరించడంతో, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వుపై ఏడు రోజుల పాటు స్టే విధించింది. ఈఅంశాన్ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించే ముందు, తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని విజయన్, ఆయన కుటుంబ సభ్యులు డివిజన్ బెంచ్ ముందు వాదించారు.
CMRL-Exalogic case : విజయన్ పిటిషన్‌పై సోమవారం విచారణ
35 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)