సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్వార్టర్స్‌‌కు షెల్టన్‌, టఫీ

1 గంట క్రితం

toyi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 10:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రీ క్వార్టర్స్‌‌లో ఓడిన మెద్వదెవ్‌, సిట్సిపాస్‌

- యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌పురుషుల సింగిల్స్‌‌లో పెను సంచలనం నమోదైంది. 7వ సీడ్‌, రష్యాకు చెందిన మెద్వదెవ్‌, గ్రీక్‌ ‌స్టార్‌ ‌సిట్సిపాస్‌ ‌ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్లో ఇంటిదారి పట్టారు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో మెద్వదేవ్‌ 6-7(1-7), 4-6, 6-7(6-8)తో 11వ సీడ్‌, అమెరికాకు చెందిన టఫీ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యాడు. ఇక 8వ సీడ్‌ ‌షెల్టన్‌(అమెరికా) 6-2, 6-3, 6-4తో అన్‌‌సీడెడ్‌ ‌సిట్సిపాస్‌‌ను ఓడించి క్వార్టర్‌ ‌ఫైనల్‌‌కు చేరాడు. మరో పోటీలో అన్‌‌సీడెడ్‌ అమెరికాకు చెందిన మైకెల్సన్‌ 7-6(8-6), 6-4, 6-4తో 27వ సీడ్‌, అర్జెంటీనాకు చెందిన ఎచెవెర్డిను ఓడించాడు. దీంతో సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్లో ముగ్గురు అమెరికా ఆటగాళ్లు స్థానిక గ్రాండ్‌‌స్లామ్‌‌ ‌టోర్నీ క్వార్టర్‌‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగే క్వార్టర్‌‌ఫైనల్లో 11వ సీడ్‌ ‌టఫీతో మైకెల్సన్‌ ‌తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌‌ రెండోరౌండ్‌‌లో భారత్‌‌కు చెందిన శ్రీరామ్‌ ‌బాలాజీ పోరాటం ముగిసింది. రెండోరౌండ్‌‌లో బాలాజీ-కింగ్‌(అమెరికా) జంట 4-6, 5-7తో 12వ సీడ్‌, రోజర్‌(‌చెక్‌)-‌నైస్‌(‌పోలండ్‌) ‌చేతిలో పరాజయాన్ని చవిచూశారు. మరో పోటీలో అనిరుద్‌(‌భారత్‌)-‌లియుటరేవిచ్‌(‌రష్యా) జంట తొలిరౌండ్‌‌లో 4-6, 7-5, 4-6తో బ్రిటన్‌ ‌జంట చేతిలో ఓడారు.

మహిళల సింగిల్స్‌‌లోనూ అమెరికన్ల హవా...

మహిళల సింగిల్స్‌‌లోనూ అమెరికాకు చెందిన 3వ ర్యాంకర్‌ జెస్సికా పెగూలా, 26వ సీడ్‌ ‌ఎమ్మా నవార్రో ప్రవేశించారు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్లో మ్యాచుల్లో నవర్రో 6-4, 6-2తో 21వ సీడ్‌, రష్యాకు చెందిన కలిన్స్కయాను చిత్తుచేయగా.. మరో పోటీలో పెగూలా 6-3, 6-4తో 16వ సీడ్‌ ‌సిర్స్టియా(జర్మనీ)ని చిత్తుచేసి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్