సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు కార్పొరేషన్‌‌కి జాతీయ స్థాయి గుర్తింపు

58 నిమిషాల క్రితం

gnt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : వాయు కాలుష్య నియంత్రణలో ప్రత్యేక చర్యలు తీసుకున్న గుంటూరు కార్పొరేషన్‌‌కి ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’ -2026 ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్‌‌లో సోమవారం కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో భారత జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, గుంటూరు నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు. దేశవ్యాప్తంగా 130 నగరాల మధ్య జరిగిన పోటీల్లో గుంటూరు పట్టణాల కేటగిరిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో కేటగిరీ రెండు (10,000 నుండి 30,000 జనాభా వర్గం)లో జిఎంసి 42వ వార్డు తొలి స్థానంలో నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ, గుంటూరు నగరవాసులకు కమిషనర్ అభినందనలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్