సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెంకయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి

1 గంట క్రితం

yogi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- స్వర్ణ భారత్ ట్రస్టు రజతోత్సవ వేడుకల్లో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి, తిరుమల : స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచిన పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్టు 25 సంవత్సరాల ఉత్సవాలకు సోమవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న సమయంలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ పదవికి, బాధ్యతలకు అద్భుతంగా న్యాయం చేశారని ప్రశంసించారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య వెంకయ్యనాయుడు సాంస్కృతిక వారథిగా పనిచేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానం, స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానం ఒకేసారి పూర్తికావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మాజీ ఉప రాష్రపతి ఎం.వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, వై.సత్య కుమార్, ఎంపి బీద మస్తాన్ రావు, ఎంఎల్‌ఎ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాన్హు శుక్లా, స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాసరావు, ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు హర్ష, తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆయన అక్షర విద్యాలయం, స్వర్ణ భారత్ ట్ర‌స్ట్‌‌ను సందర్శించారు.​తిరుమల శ్రీవారిని యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. ఆయనకు మంత్రులు నారాయణ, సత్యకుమార్ ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్