ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫైనల్‌‌కు షెల్టన్‌, జ్వెరేవ్‌

8 గంటల క్రితం

tennis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌పురుషుల సింగిల్స్‌ ‌ఫైనల్లోకి టాప్‌‌సీడ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ ‌జ్వెరేవ్‌, 8వ సీడ్‌, అమెరికాకు చెందిన బెన్‌ ‌షెల్టన్‌ ‌ప్రవేశించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో బెన్‌ ‌షెల్టన్‌ ‌నాలుగు సెట్ల హోరాహోరీ పోరులో అమెరికాకే చెందిన 11వ సీడ్‌ ఫ్రాన్సిస్‌ ‌టఫీ‌ని చిత్తుచేయగా.. జ్వెరేవ్‌ ‌వరుససెట్లలో అన్‌‌సీడెడ్‌, రష్యాకు చెందిన కరెన్‌ ‌ఖచనోవ్‌‌ను ఓడించాడు. టాప్‌ ‌సీడ్‌ ‌జ్వెరేవ్‌ తొలి సెట్‌‌ను సునాయాసంగా గెలుచుకున్నా.. ఆ తర్వాత రెండు సెట్‌‌లను టై బ్రేకర్‌‌ గెలిచేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సెమీస్‌‌లో జ్వెరేవ్‌ 6-3, 7-6(9-7), 7-6(8-6)తో ఖచనోవ్‌‌ను ఓడించి తుదిపోరుకు చేరాడు. 29ఏళ్ల జ్వెరేవ్‌ ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిల్‌‌ను సాధించిన కెరీర్‌‌లో తొలి గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిల్‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం 2020లో తొలిసారి యుఎస్‌ ఓపెన్‌ ‌ఫైనల్‌‌కు చేరినా.. ఆస్ట్రేలియాకు చెందిన డోమినిక్‌ ‌థీమ్‌ ‌చేతిలో ఓడి రన్నరప్‌‌కే పరిమితమయ్యాడు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆదివారం తుదిపోరుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ ఏడాది జరిగిన మూడు గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీల్లోనూ జ్వెరేవ్‌ ‌ఫైనల్‌‌కు చేరాడు. ఈ క్రమంలో ఒకే ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా ఘనత నమోదు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచిన అతడు.. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. తాజాగా యుఎస్ ఓపెన్‌ సెమీస్‌లో కచనోవ్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు.

అమెరికాకు చెందిన 23 ఏళ్ల బెన్ షెల్టన్, 28ఏళ్ల ఫ్రాన్సిస్‌ ‌టఫీ‌ల మధ్య సెమీస్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు స్థానిక ఆటగాళ్లు సెమీస్‌‌తో తలపడడం యుఎస్ ఓపెన్‌కు హైలైట్‌‌గా నిలిచింది. తొలి సెట్‌‌లో ఒక బ్రేక్‌ ‌పాయింట్‌ ‌సాధించి విజయం సాధించిన టఫీకి రెండో సెట్‌లో షెల్టన్‌ ‌నుంచి గట్టి పోటీ ఎదురైంది. మూడు సెట్‌‌లలో ఒక్కో బ్రేక్‌ ‌పాయింట్‌ ‌సాధించి మ్యాచ్‌‌ను ముగించాడు.

శనివారం అర్ధరాత్రి మహిళల సింగిల్స్‌ ‌టైటిల్‌ ‌పోరు జరగనుంది. టాప్‌‌సీడ్‌, బెలారస్‌‌కు చెందిన అర్యానా సబలెంకా, 2వ సీడ్‌ ‌కజకిస్తాన్‌‌కు చెందిన ఎలేనా రైబకినా 2026 యుఎస్‌ ఓపెన్‌ ‌మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. 2024, 2025లలో యుఎస్‌ ఓపెన్‌ ‌గెలిచిన సబలెంక హ్యాట్రిక్‌‌పై గురిపెట్టగా.. రైబకినాకు ఇదే తొలి యుఎస్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌ఫైనల్‌. 2022(వింబుల్డన్‌), 2026లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టైటిళ్లు గెలిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్