నేటినుంచి దక్షిణాఫ్రికా, ఆసీస్ తొలి టెస్ట్
డర్బన్: ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడాకు చోటు దక్కలేదు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుండగా.. డర్బన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కోసం దక్షిణాఫ్రికా తుది జట్టును గురువారం ప్రకటించింది. గాయం కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్‌కు అతడు దూరమైనట్లు దక్షిణాఫ్రికా బోర్డు పేర్కొంది. రబడా స్థానంలో అన్రిచ్ నోర్జే తుది జట్టులోకి వచ్చాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నోర్జే టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. చివరిసారిగా అతడు 2023 ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు. కెప్టెన్ టెంబా బవుమాకు ఇది అసలు సిసలు పరీక్ష. డర్బన్ పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంది. కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
తొలి టెస్ట్‌కు దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, రికెల్టన్ (వికెట్ కీపర్), ముల్డర్, స్టబ్స్, వెర్రియన్, బెడింగ్‌హామ్, యాన్సెన్, నోర్జే, హార్మర్, మహారాజ్.







కామెంట్‌లు (0)