నేడు వెస్టిండీస్‌తో రెండో టి20
రాత్రి 7.00గం.ల నుంచి
రాంచీ: తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇక రెండో టి20 విజయంపై దృష్టి సారించింది. రాంచీ వేదికగా శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగే రెండో టి20లో టీమిండియా గెలిస్తే ఐదు టి20ల సిరీస్ గెలుపుకు చేరువకానుంది. లక్నో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ నిర్దేశించిన 172పరుగుల భారీ ఛేదనను టీమిండియా కేవలం 14.4ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 43బంతుల్లో 10ఫోర్లు, 6భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 102 పరుగులు చేసి ఈ ఫార్మాట్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. లక్నోలో జరిగిన తొలి టీ20లో శతకంతో మెరిసిన శ్రేయస్.. కెరీర్ బెస్ట్‌గా ఐసిసి ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి ఎగబాకాడు. శ్రేయస్‌కి తోడు ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు శుభ పరిణామం. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మకి తోడు తిలక్ వర్మ, తిలక్ వర్మ, దూబేలతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేధ్యంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. తొలి టి20తో అంతర్జాతీయ క్రికెటల్‌లో అరంగేట్రం చేసిన నమన్ ధీర్ విండీస్ ప్రధాన వికెట్లు 3 పడగొట్టి భారీస్కోర్ చేయకుండా నిలువరించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన శ్రేయస్ అయ్యర్ సేన.. అదే ఉత్సాహంతో రెండో టి20కి సిద్ధమైంది.
మరోవైపు విండీస్ బౌలర్లు టీమిండియాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. తొలి మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్న మాథ్యూ ఫోర్డే ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నాడు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్, షెర్ఫాన్ రూథర్డ్ ఫోర్డులపైనే ప్రధానంగా ఆధారపడిం ఉంది. విండీస్ జట్టు భారత్‌ను ఓడించాలంటే బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించాల్సి ఉంది. భారత బౌలింగ్ దాడిలోని వైవిధ్యాన్ని ఎదుర్కొని అంత పెద్ద స్కోరు చేయడం వారికి కఠిన పరీక్షే. తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జట్టును కొనసాగించే అవకాశముంది. ఇక రెండో టి20 జరిగే రాంచీ మైదానం తొలుత బ్యాటర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. తొలి మ్యాచ్ జరిగిన లక్నో స్టేడియం మాదిరిగానే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. మధ్య ఓవర్లలో స్పిన్ బౌలర్లు బ్యాటర్లపై ప్రభావం చూపుతారు. రాత్రి మంచు బంతిపై కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే వరుసగా 9 టి20లో విజయాలను నమోదు చేసుకున్న శ్రేయస్ సేన సేన .. రోహిత్ శర్మ రికార్డు(వరుసగా 11 విజయాలు) రికార్డును బ్రేక్ చేయడమే లక్షంగా బరిలోకి దిగుతోంది.
జట్లు(అంచనా)..
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్, తిలక్ వర్మ, దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, కుల్దీప్, ప్రిన్స్ యాదవ్.
వెస్టిండీస్: హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), కమిల్, హెట్‌మైర్, పావెల్, రూథర్డ్‌ఫోర్డు, ఛేస్, షెఫర్డ్, ఫోర్డే, స్ప్రింగర్, ఆకెల్ హొసైన్, జోసెఫ్.







కామెంట్‌లు (0)