45 బంతుల్లో 102పరుగులు
వెస్టిండీస్ రికార్డు ఛేదన
రెండో టి20లో టీమిండియా ఓటమి
రాంచీ: కెప్టెన్ షాయ్ హోప్ మెరుపు శతకానికి తోడు రూథర్డ్‌ఫోర్డ్ ధనా ధన్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో రెండో టి20లో వెస్టిండీస్ జట్టు ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హోప్(102నాటౌట్; 45బంతుల్లో 6ఫోర్లు, 9భారీ సిక్సర్లు) శతకంతో మెరిసాడు. మరోవైపు రూథర్డ్‌ఫోర్డ్(84; 37బంతుల్లో 7ఫోర్లు, 7సిక్సర్లు) రాణించి 120పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో విండీస్ టి20ల్లో తొలి, ఈ ఫార్మాట్‌లో రెండో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. తొలుత కిమన్ పూరన్(4), హెట్‌మైర్(0), రువాన్ పావెల్(24) నిరాశపరిచినా.. హోప్, రూథర్డ్‌ఫోర్డ్‌కి తోడు షెఫర్డ్(34నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. టీమిండియా బౌలర్లు మయాంక్ యాదవ్‌కు మూడు వికెట్లు లభించారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్(82; 41బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు)కి తోడు ఇషాన్ కిషన్(20) తొలి వికెట్‌కు 72పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ సంజూ శాంసన్ మెరుపు ఆరంభాన్ని కొనసాగిస్తూ.. మిడిలార్డర్ బ్యాటర్లు ఎడాపెడా దంచేశారు. అయ్యర్, తిలక్ వర్మ చివరి 4ఓవర్లు 72పరుగులు రాబట్టడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్(43), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(40)లు వెస్టిండీస్ బౌలర్లను చితక్కొట్టారు. డెత్ ఓవర్లలో తిలక్ వర్మ(44 నాటౌట్) సిక్సర్లతో హోరెత్తించాడు. సంజూ, ఇషాన్‌ల దూకుడుతో పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్ చేశారు. ఈ క్రమంలో శాంసన్ 21 బంతుల్లోనే అర్ధ సెంచరీతో చెలరేగాడు. అకీల్ హోసేన్ ఓవర్లో వరసగా 4, 6, 6, 4తో 22 పరుగులు పిండుకున్న సంజూ.. షెపర్డ్ వేసిన ఆరో ఓవర్లో బ్యా్క్ టు బ్యాక్ బౌండరీలతో అర్ధ శతకం సాధించాడు. దాంతో పవర్ ప్లేలో 79 రన్స్ చేసింది ఇండియా. ఫలితంగా ఈ ఫార్మాట వెస్టిండీస్‌పై గతంలో అత్యధిక స్కోర్‌గా ఉన్న 72 పరుగుల రికార్డు బద్ధలైంది. అభిషేక్ శర్మ(20) ఔటయ్యాక దూకుడు పెంచిన సంజూకు ఇషాన్ కిషన్(43) అగ్నికి వాయువులా తోడయ్యాడు. దంచికొడుతున్న ఇషాన్‌ను ఔట్ చేసిన రోస్టన్ ఛేజ్(3/24)..ఆ తర్వాతి ఓవర్లో శివం దూబే(7)ను పెవిలియన్ చేర్చాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(40), తిలక్ వర్మ(44 నాటౌట్) పిడుగల్లే విండీస్ బౌలర్లపై పడ్డారు. దాంతో.. డెత్ ఓవర్లలో వీరి వీరకొట్టుడుకు విండీస్ బౌలర్లు బలవ్వగా.. ఏకంగా 80 రన్స్ వచ్చాయి. వెస్టిండీస్ బౌలర్లు ఛేస్‌కు మూడు, స్ప్రింగర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాయ్ హోప్‌కు లభించగా.. మూడో టి20 ఇండోర్ వేదికగా ఆదివారం జరగనుంది.
స్కోర్‌బోర్డు...
ఇండియా ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి)మోటీ (బి)ఛేస్ 20, సంజు శాంసన్ (సి)కమిల్ పూరన్ (బి)స్ప్రింగర్ 82, ఇషాన్ కిషన్ (బి)ఛేస్ 43, దూబే (బి)ఛేస్ 7, శ్రేయస్ అయ్యర్ (సి)హెట్‌మైర్ (బి)స్ర్పింగర్ 40, తిలక్ వర్మ (నాటౌట్) 44, నమన్ ధీర్ (నాటౌట్) 4, అదనం 9. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 249పరుగులు.
వికెట్ల పతనం: 1/42, 2/139, 3/158, 4/162, 5/245
బౌలింగ్: హొసైన్ 3-0-46-0, షెఫర్డ్ 3.4-0-47-0, ఛేస్ 4-0-24-3, మోటీ 2-0-21-0, జోసెఫ్ 3-0-39-0, స్ప్రింగర్ 4-0-64-2, రోమన్ 0.2-0-7-0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (నాటౌట్) 102, కమిల్ పూరన్ (సి)బిష్ణోయ్ (బి)మయాంక్ యాదవ్ 4, హెట్‌మైర్ (బి)మయాంక్ యాదవ్ 0, రువాన్ పావెల్ (సి)సంజు శాంసన్ (బి)కుల్దీప్ 84, షెఫర్డ్ (నాటౌట్) 34, అదనం 4. (18.3ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 252పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/5, 3/58, 4/178
బౌలింగ్: మయాంక్ 3-0-36-3, ఆర్ష్‌దీప్ 4-0-45-0, అక్షర్ 3.3-0-63-0, దూబే 2-0-30-0, కుల్దీప్ 4-0-53-0, నమన్ 2-0-25-0.







కామెంట్‌లు (0)