మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కష్టకాలంలో విరాట్ అండగా నిలిచారు : పి.వి.సింధు

7 గంటల క్రితం

Virat stood by me during tough times: P.V. Sindhu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచారని వెల్లడించింది. జపాన్ ఓపెన్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. గత రెండేళ్లుగా వరుస గాయాలు, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని సింధు తెలిపింది. పలు టోర్నీల్లో తొలి, రెండో రౌండ్లకే నిష్క్రమించాల్సి వచ్చిందని, ఈ పరిస్థితుల్లో తన ఆటపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని పేర్కొంది. అయితే జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా తానింకా అత్యున్నత స్థాయిలో పోటీ పడగలనని నిరూపించుకున్నానని చెప్పింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తనకు అందించిన మద్దతును ఆమె గుర్తు చేసుకుంది. "నేను విరాట్ భాయ్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా కెరీర్ అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు నేను ఆయనను సంప్రదించాను. వరుస గాయాలు, ఆశించిన ఫలితాలు లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమైంది. నేను సందేశం పంపిన కొద్ది నిమిషాల్లోనే ఆయన స్పందించారు. మరుసటి రోజే మేము కలుసుకున్నాం. ఆయన ఇచ్చిన సలహాలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆయన చెప్పిన మాటలు నాకు, నా భర్త దత్తాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కొన్ని సంభాషణలు మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తాయి. అలాంటి అనుభవమే అది" అని సింధు పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్