నేడు శ్రీలంకతో టీమిండియా ఢీ
ఉదయం 10.30గం.ల నుంచి
ఐచి-నగోయా: ఆసియా క్రీడల్లో భారత్‌కు కచ్చితంగా స్వర్ణం గెలిచే క్రీడల్లో క్రికెట్ ఒకటి. ఈ విభాగంలో భారత మహిళా జట్టు ఇప్పటికే స్వర్ణ పతకాన్ని సాధించగా.. పురుషుల టీమ్ రెండడుగుల దూరంలో నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్లో శ్రేయస్ సేన శ్రీలంకతో తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్ నేరుగా సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ నాలుగు మ్యాచ్‌లకూ వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో మెరుగైన ర్యాంకింగ్‌తో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరాయి. తొలి సెమీస్‌లో పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్, రెండో సెమీస్‌లో శ్రీలంకతో భారత్ తలపడనున్నాయి. వర్షం కారణంగా ఈ సెమీస్ మ్యాచులు రద్దయితే భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఒకవేళ ఫైనల్ కూడా రద్దు అయితే.. భారత్ ఖాతాలో స్వర్ణం పడినట్లే. పాక్ కంటే మెరుగైన ర్యాంక్ మనదే కదా.. ఇక మూడో స్థానానికి.. అంటే కాంస్య పతకం కోసం కూడా బంగ్లా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు కూడా వర్షం పడి ఆగిపోతే శ్రీలంకకు కాంస్యం దక్కుతుంది.








కామెంట్‌లు (0)