శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యువ క్రికెట‌ర్ విశ్వనాథ్ వైష్ణవ్ మృతి

1 గంట క్రితం

tg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 11:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ర్టం వ‌రంగ‌ల్ జిల్లా క‌రీమాబాద్‌కు చెందిన యువ క్రికెట‌ర్ విశ్వనాథ్ వైష్ణవ్ (21) మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కరీమాబాద్‌కు చెందిన ఓం ప్రకాశ్‌, సునీత దంప‌తులు కిరాణ దుకాణం న‌డుపుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు విశ్వనాథ్ వైష్ణవ్, కూతురు చైత‌న్య సంతానం. ఆల్‌రౌండర్ అయిన వైష్ణవ్ ఇటీవ‌ల జ‌రిగిన టిజి-20 లీగ్‌లో వ‌రంగ‌ల్ వారియ‌ర్స్ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నారు. గత నెల 26న రాత్రి ఉప్పల్ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్