- భీమవరంలో కొత్త బ్రాంచ్ ప్రారంభం
విజయవాడ : ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ (ఎబిహెచ్‌ఎఫ్‌ఎల్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన శాఖను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తన నెట్‌వర్క్‌ను 15 బ్రాంచ్‌లకు విస్తరించినట్లు ప్రకటించింది. తమ ఈ కొత్త శాఖలో ఆగస్టు 31 వరకు జీరో లాగిన్ ఫీజుతో పాటు రూ. 50 లక్షల వరకు తక్షణ గృహ రుణ మంజూరు ఆఫర్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్థ ఎండి అండ్ సిఇఒ పంకజ్ గాడ్గిల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తమకు కీలకమైన మార్కెట్ అని, డిజిటల్ సేవల ద్వారా గృహ రుణ ప్రక్రియను వేగవంతం చేసి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు.








కామెంట్‌లు (0)