- హైదరాబాద్ సర్కిల్ సిజిఎం నీలేష్ ద్వివేది
ప్రజాశక్తి - హైదరాబాద్ : కోటిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) స్థానిక ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) నీలేష్ ద్వివేది జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో ఎస్‌బిఐ పాత్ర కీలకమైనదని, మారుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు ఎఐ, యోనో వంటి డిజిటల్ సేవల ద్వారా బ్యాంక్ వేగంగా రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ బ్యాంక్‌ను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా సిబ్బంది, వారి పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ రష్మి ద్వివేది, జనరల్ మేనేజర్లు సతీష్ కుమార్, రణవిజయ్ ప్రతాప్‌లతో పాటు ఇతర సీనియర్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)