ప్రజాశక్తి–కాకినాడ: కాకినాడ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 106.0 మిల్లీమీటర్ల సరాసరితో మొత్తం 2,225.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాళ్లరేవు మండలంలో 139.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తుని మండలంలో 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో): తాళ్లరేవు 139.8, కరప 134.4, కాకినాడ అర్బన్ 132.6, జగ్గంపేట 132.4, సామర్లకోట 130.6, కాకినాడ రూరల్ 130.6, పెద్దాపురం 128.4, కాజులూరు 126.4, గండేపల్లి 122.8, గొల్లప్రోలు 115.8, పిఠాపురం 115.8, పెదపూడి 110.4, కిర్లంపూడి 108.2, ప్రత్తిపాడు 101.6, ఏలేశ్వరం 94.6, యు.కొత్తపల్లి 87.8, శంఖవరం 70.6, రౌతులపూడి 68.2, తొండంగి 60.8, కోటనందూరు 59.2, తుని 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Print Editionకాకినాడ జిల్లాలో 106.0 మిల్లీమీటర్ల వర్షపాతం
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)