ప్రజాశక్తి- బాపట్ల: బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెగిపడిన విద్యుత్ వైర్ తగలడంతో తల్లి, కొడుకు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మృతులను ఉప్పరపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెగిపడిన విద్యుత్ వైర్‌తో తల్లి, కొడుకు మృతి
45 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)