ఉత్తరాంధ్రలో తీవ్ర వాయుగుండం ప్రభావం
ప్రజాశక్తి-విశాఖపట్నం: తీవ్ర వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
విశాఖపట్నం నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో రాత్రంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలోనూ భారీ వర్షాలకు వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఏకధాటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీట మునిగాయి. విశాఖ ఏజెన్సీతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.








కామెంట్‌లు (0)