మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅదనంగా 175 ఎంబిబిఎస్ సీట్లు

5 గంటల క్రితం

college
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 11:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎన్ఎంసి అనుమతి

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : రాష్ర్టంలో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 175 ఎంబిబిఎస్ సీట్లకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసి) సోమవారం అనుమతినిచ్చింది. పిడుగురాళ్లలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్లు, విజ‌య‌వాడ ప్ర‌భుత్వ సిద్దార్ధ వైద్య క‌ళాశాల‌కు అద‌నంగా 75 సీట్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) కడప ప్రభుత్వ కళాశాలలో 75 సీట్లు, నెల్లూరు కళాశాలకు 25, పాడేరు కళాశాలకు అదనంగా 50 సీట్లకు ఎన్ఎంసి అనుమతినిచ్చింది. తాజాగా 175 సీట్లకు అనుమతి రావడంతో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే 4 ప్రభుత్వ కళాశాలల్లో అద‌నంగా 325 సీట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా 505 సీట్లు, ప్రైవేట్‌లో వైద్య క‌ళాశాలల్లోనూ అద‌నంగా 550 సీట్లు చొప్పున వచ్చాయని వెల్లడించారు. ఈ సీట్లు పెరుగుదలతో నీట్ మెరిట్ విద్యార్థులకు భారీ ఊరట లభిస్తుందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్