మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఎన్టీఆర్ భ‌రోసా’కు రూ. 2711.79 కోట్లు

28 జూన్, 2026

kondapalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 09:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో 62,19,648 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసిన‌ట్టు ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జూలై 1వ తేదీ ఉద‌యం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్ష‌న్లు పంపిణీ చేస్తామ‌ని ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు జూలై 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.3.12 కోట్లను విడుదల చేసిన‌ట్టు మంత్రి తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పెన్ష‌న్ల కోసం ఈ నెల విడుద‌ల చేసిన నిధుల‌తో క‌లుపుకుని రూ. 68,598.44 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింద‌ని వెల్లడించారు. నిరుపేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భ‌రోసా పెన్షన్ నిధుల‌ను ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల‌కు అందిస్తోంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్